చేతిరాత పోటీల్లో రాష్ట్రస్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించిన జి రేష్మి
KDP: మైదుకూరు మండలం జండ్లవరం గ్రామానికి చెందిన 4వ తరగతి విద్యార్థిని జి రేష్మి, మైదుకూరు మండలం జీవి సత్రం శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతూ చేతిరాత పోటీలలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. ఈ విజయంపై విద్యార్థి తల్లిదండ్రులు రాం ప్రతాప్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని అభినందించారు.