కోడిపందాల శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

కోడిపందాల శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

కృష్ణా: కృత్తివెన్ను మండల పరిధిలోని పోడు గ్రామంలో నిషేధిత కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో కోడి పందాలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక కోడి పుంజు, పందెపు నగదును స్వాధీనం చేసుకున్నారు.