డ్యాన్స్‌తో అదరగొట్టిన నవీన్ పొలిశెట్టి- మీనాక్షి
నవీన్ పొలిశెట్టి- మీనాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు మారి తెరకెక్కిస్తున్న సినిమా 'అనగనగా ఒక రాజు'. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2026 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'భీమవరం బాల్మా' పాట విడుదల వేడుకను భీమవరం SRKR ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నవీన్- మీనాక్షి డ్యాన్స్ చేసి విద్యార్థుల్లో జోష్ నింపారు.