KGBVలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

MHBD: తొర్రూరు KGBV బాలికల విద్యాలయంలో ఇంటర్ MPHW కోర్సులో అతిథి ఆధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సింగ్‌లో ఎంఎస్సీ, బీఎస్సీ చేసిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 20న సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.