రాజస్థాన్ vs ముంబై: టాస్ ఆలస్యం
గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. భారీ వర్షం కురుస్తుండటంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. దీంతో 7 గంటలకు జరగాల్సిన టాస్ వాయిదా పడింది. మ్యాచ్ కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాగా, KKR vs PBKS మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.