దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
క్రిమినల్ కేసుల్లో న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదులకు ఏకపక్షంగా సమన్లు ఇచ్చే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈడీ సమన్లపై వివాదం రావడంతో సీజేఐ జస్టిస్ బీ.ఆర్. గవాయ్ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. 'న్యాయవాది-క్లయింట్ సంబంధం రహస్యం. మినహాయింపులు ఉంటే, ఎస్పీ స్థాయి అధికారి రాతపూర్వక ఆమోదం ఉంటేనే సమన్లు ఇవ్వాలి' అని కోర్టు తేల్చిచెప్పింది.