28 పతకాలతో అగ్రస్థానంలో రాష్ట్ర జైళ్ల శాఖ

TG: బండ్లగూడలోని రాష్ట్ర పోలీస్ అకాడమీలో జరిగిన 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్-2025లో తెలంగాణ జైళ్ల శాఖ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మొత్తం 28 పతకాలతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. వీటిలో 21 స్వర్ణ, 4 వెండి, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ పోటీలలో తమిళనాడు 17 పతకాలతో రెండో స్థానంలో నిలవగా, మధ్యప్రదేశ్ 6 పతకాలతో మూడో స్థానం దక్కించుకుంది.