సీఆర్టీలను రెగ్యులర్ చేయాలి

ASR: జిల్లాలో అనేక కారణాల వల్ల రెగ్యులర్ కాని సీఆర్టీలను కూడా రెగ్యులర్ చేయాలని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. ఈమేరకు శుక్రవారం అమరావతిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 86మంది సీఆర్టీలను రెగ్యులర్ చేయాల్సి ఉందన్నారు. గతంలో పలువురు సీఆర్టీలను రెగ్యులర్ చేయడం జరిగిందని గుర్తు చేశారు.