'పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలి'

KDP: పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పొద్దుటూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బోడెల బాబుల్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులుని కలిశారు. అనంతరం ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.