రోడ్ల విస్తరణ భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

SRCL: వేములవాడ పట్టణంలోని మూలవాగు నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ, భూ సేకరణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.