వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
కోనసీమ: కె.గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం రాత్రి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీలో చేరారు. గ్రామ విద్యా కమిటీ మాజీ ఛైర్మన్ నాగబత్తుల సత్యనారాయణ, గొట్టు రవి కిరణ్, బెల్లపు అప్పారావుతోపాటు మరో ప్రతి కుటుంబాలకు చెందిన వారికి మంత్రి సుభాష్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.