ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలించిన కలెక్టర్

KMR: జిల్లా కేంద్రంలోని శాబ్దిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు చింతల సుమలత శ్రీనివాస్ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి, లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. కలెక్టర్ ఇంటి నిర్మాణ పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకుంటూ పనులు ఎలా కొనసాగుతున్నాయన్నారు.