భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

SRD: భార్య కాపురానికి రావడం లేదనే బెంగతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సిర్గాపూర్ మండలంలోని కడ్పాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ (28), అతని భార్య వినోద మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పంచాయతీ పెట్టినా ఆమె తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్ఞానేశ్వర్, బుధవారం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.