ఒంటిమిట్ట సీతారామలక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు
AP: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలకు పారిశ్రామికవేత్త పుట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీదేవి రూ.2.85 కోట్ల విలువైన 2.241 కిలోల స్వర్ణ కిరీటాలను సమర్పించారు. ఆలయ అధికారులు దాతలకు స్వాగతం పలికి, స్వర్ణ కిరీటాలతో ఆలయ ప్రదక్షణ చేయించారు. అనంతరం మూల విరాట్ చెంత కిరీటాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.