హైదరాబాద్ కలెక్టరేట్‌లోనే నీటి సమస్య
HYD: నగర కలెక్టరేట్‌లో నీటి సమస్య నెలకొంది. నిత్యావసర పనులకు నీరు లేక సిబ్బంది విలవిలాడుతున్నారు. పది రోజులుగా ఈ సమస్య నెలకొంది. పైప్‌లైన్ సమస్య కారణంగా నీటి ఇబ్బంది నెలకొంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక మంది సమస్యలతో కలెక్టరేటు వస్తుంటారు. అలాంటిది కలెక్టరేట్‌లోనే సమస్య వస్తే ఎలా అని విమర్శలు వస్తున్నాయి.