దేశానికి సైనికుల సేవలు భేష్: కలెక్టర్
SS: పుట్టపర్తి కలెక్టరేట్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మా మాట్లాడుతూ.. సైనికులు, మాజీ సైనికులు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్, సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప, జిల్లా అధికారులు సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు అందజేశారు.