పద్మాపురంలో మంచినీటి పైప్ లైన్‌కు నిధులు మంజూరు

పద్మాపురంలో మంచినీటి పైప్ లైన్‌కు నిధులు మంజూరు

ప్రకాశం: వెలిగండ్ల మండలం పద్మాపురం బీసీ కాలనీలో మంచినీటి సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు గురవుతున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డికి తెలియడంతో ఆయన స్పందించారు. బీసీ కాలనీకి మంచినీటి పైపులైను నిర్మాణ పనులకు రూ.8 లక్షలు మంజూరు చేయించారు. గ్రామంలో శనివారం పైపులైన్ పనులను ప్రారంభించారు దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.