కుల ధ్రువీకరణ పత్రం ఇక సులభం

కుల ధ్రువీకరణ పత్రం ఇక సులభం

TG: కుల ధ్రువీకరణ పత్రాల ప్రక్రియను  'మీ సేవ' సులభతరం చేసింది. BC, SC, ST ప్రజలు కుల ధ్రువీకరణ పత్రాలను నేరుగా మీ సేవలో పొందే అవకాశాన్ని కల్పించింది. గతంలో ప్రతి దరఖాస్తుకు తహసీల్దార్ ఆమోదం తప్పనిసరిగా ఉండేది. కానీ ప్రభుత్వం అధికారులతో చర్చించి నేరుగా మీ సేవలో సర్టిఫికేట్ పొందేలా ఆదేశాలిచ్చింది. కులంలో మార్పులు చేసుకున్న వ్యక్తుల దరఖాస్తులను పాత ప్రక్రియలో జారీ చేయనుంది.