నేతన్న విగ్రహానికి మంత్రి నివాళి

సత్యసాయి: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరంలోని కదిరి గేట్‌వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి మంత్రి సత్యకుమార్, కలెక్టర్ చేతన్ నివాళులర్పించారు. అనంతరం చేనేతలను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హ్యాండ్ లూమ్స్‌కు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.