బస్టాండులో నిరుపయోగంగా ATM

బస్టాండులో నిరుపయోగంగా ATM

VKB: పరిగి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన రెండు ఏటీఎంలు ప్రస్తుతం మూతపడ్డాయి. నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్‌లో ఏటీఎం లేకపోవడంతో, వారు మార్కెట్ రోడ్డులోని ఎస్‌బీఐ, ఇతర ప్రాంతాలలోని ఏటీఎంలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విషయంపై అధికారులు స్పందించి, బస్టాండులో ఏటీఎంను తిరిగి ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.