మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రులు బీసీ, ఫరూక్
NDL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ వెలుగు, మెప్మా సంఘాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. జూపాడుబంగ్లాకు చెందిన మహిళా వ్యవసాయ ఉత్పత్తి సంఘాలకు రూ.8 లక్షల విలువైన మహేంద్ర ట్రాక్టర్‌ను అందజేశారు.