సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేసిన సర్పంచ్
KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో మంగళవారం ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ముత్యాలమ్మ గుడి నుంచి దేవబత్తిన శేషగిరిరావు ఇంటివరకు, సువ్వారపు సూరి ఇంటి నుంచి శివయ్య ఇంటివరకు పనులు చేపట్టనున్నారు. సర్పంచ్ తుళ్లూరి నిర్మలకుమారి, ఉప సర్పంచ్ పార్వతి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బండారు నరసింహారావు పాల్గొన్నారు.