VIDEO: వైభవంగా భాగిర్తమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు
కోనసీమ: కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ భాగిర్తమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సోమవారం రాత్రి వైభవంగా జరిగాయి. వారం రోజులు సంబరాలు అనంతరం జరిగిన ఈ జాతర మహోత్సవంలో ఏర్పాటు చేసిన గరగ నృత్యాలు, బాణా సంచా పేలుళ్లు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తీర్థ మహోత్సవాలు మంగళవారం జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.