ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోండి: ఎస్పీ
SKLM: ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. అర్జీదారుల తో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. 72 వినతులు స్వీకరించినట్లు తెలిపారు.