జిల్లాలో భగ్గుమన్న భానుడు

KDP: జిల్లాలో సోమవారం భానుడు నిప్పులు కురిపించాడు. జిల్లాలో 36 మండలాలు ఉండగా, అందులో 28 మండలాల్లో 40 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముద్దనూరు మండలంలో అత్యధికంగా 42.3 డిగ్రీలు, బద్వేలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వేడిగాలి, ఉక్కపోతులతో ప్రజలు అల్లాడిపోయారు. వృద్ధులు, చిన్నారులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.