ఈవిఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
VZM: నెల్లిమర్ల వద్ద ఉన్న ఈవిఎం గోధాములను జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. గోదాముకు వేసిన సీళ్ళను తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాస మూర్తి, తహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు పాల్గొన్నారు.