అసెంబ్లీలో నీటి సమస్యపై ఎమ్మెల్యే గళం
KRNL: కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై MLA బొగ్గుల దస్తగిరి ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం వారానికి మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీరు సరఫరా అవుతోందని పేర్కొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అదనంగా సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని, గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైప్లాన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.