మొయినాబాద్‌లో రూట్ మార్చ్
RR: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు మొయినాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్ రెడ్డి పర్యవేక్షణలో అమ్డాపూర్, శ్రీరామ్‌నగర్, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో రూట్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.