ఊట్కూరు గ్రామంలో BSP జెండా ఆవిష్కరణ
NLG: శాలిగౌరారం మండల పరిధిలోని ఊట్కూరు గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఎస్పీ రాష్ట్ర నాయకులు బొడ్డు కిరణ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు హాజరై జెండా ఆవిష్కరించారు. దేశ జనాభాలో 90 శాతం పైగా జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పోరాడే ఏకైక పార్టీ 'BSP' అని అన్నారు.