తిరుమలలో మొబైల్ ఫోన్ల దొంగ అరెస్టు

తిరుమలలో మొబైల్ ఫోన్ల దొంగ అరెస్టు

CTR: తిరుమలలో శ్రీవారి భక్తుల మొబైల్ ఫోన్లను దొంగలించే దొంగను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3.5 లక్షల విలువ గల 15 మొబైల్ ఫోన్లు, 20 గ్రా.బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఈ మేరకు భక్తుడి ముసుగులో తరచుగా తిరుమల వస్తూ సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దొంగిలించే వాడని, నిందితుడు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మెట్టు కిశోర్ రెడ్డిగా గుర్తించామని పోలీసులు చెప్పారు.