'యువత గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలి'

'యువత గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలి'

HNK: యువత గెలుపు, ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం వేలేరు మండల కేంద్రంలో జరిగిన 25వ జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలలో రాణించిన భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని అన్నారు.