ముఖద్వారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కలిగిరి మండలం పోలంపాడు గ్రామానికి ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ ముఖద్వారాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఇవాళ ప్రారంభించారు. స్థానిక గ్రామస్తులు బొల్లినేని రామానాయుడు సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు నిర్మించిన, పోలేరమ్మ ముఖద్వారాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.