ఘనంగా ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాత్రంత్ర కోసం పోరాడి, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినప్పటైకినూ, నిరడంబర జీవితం బతికారు అని కొనియాడారు.