'తొర్రూరు మున్సిపాలిటీకి భారీ ఆదాయం'
MHBD: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తొర్రూరు మున్సిపాలిటీకి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వచ్చింది. నామినేషన్లు వేసే అభ్యర్థులతో పాటు వారి మద్దతుదారులంతా ఇంటి పన్నుల బకాయిలు చెల్లించాల్సి ఉండడంతో మూడు రోజులకు సుమారు రూ.4,61,000 ఆదాయం వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ శనివారం తెలిపారు.