VIDEO: మల్లన్న స్వామిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే
JGL: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్లో నిర్వహిస్తున్న మల్లన్న స్వామి జాతర సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆలయానికి చేరుకుని మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో పాడి, పంటలు సమృద్ధిగా పండాలని మల్లన్న స్వామిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.