గైర్హాజరైన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
SRD: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి గైర్హాజరైన ఉపాధ్యాయులపై విద్యాశాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. సాంఘిక శాస్త్రం మూల్యాంకనానికి హాజరుకాని 78 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే సదరు ఉపాధ్యాయులను విధులకు రిలీవ్ చేయని 39 మంది HM కూడా మెమోలు ఇచ్చారు.