విద్యార్థులను అభినందించిన అదనపు కలెక్టర్
జగిత్యాల మైనారిటీ గురుకుల విద్యార్థులను అదనపు కలెక్టర్ రాజు గౌడ్ సన్మానించారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన నందిత (466/470), శ్రీనిధి (991/1000)లను ప్రత్యేకంగా అభినందించారు. ఇతర కళాశాలల ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా సత్కరించి, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు.