ఖాళీగా ఎమిరేట్స్ విమానాలు
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నిత్యం కళకళలాడే దుబాయ్ విమానాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఇతర దేశాల నుంచి దుబాయ్‌కి వచ్చే ఎమిరేట్స్ విమానాలు దాదాపు ఖాళీగా ఉంటున్నట్లు సమాచారం. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది. దుబాయ్ నుంచి బయటకు వెళ్లే విమానాలు రద్దీగానే ఉంటున్నాయని తెలిపింది. కానీ, తిరిగొచ్చేటప్పుడు మాత్రం ఖాళీగా ఉంటున్నట్లు పేర్కొంది.