నేడు నూజివీడులో మంత్రి సారధి పర్యటన

ELR: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం చిన్నాగిరి పల్లి గ్రామంలో మంత్రి పర్యటన ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు నూజివీడు మండలం మోర్సపూడి జరిగే వివిధ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.