ఎల్.ఎల్. ఆర్ సర్వర్ పనిచేయకపోవడంతో అవస్థలు

ఎల్.ఎల్. ఆర్ సర్వర్ పనిచేయకపోవడంతో అవస్థలు

SKLM: ఎచ్చెర్లలలో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో గత మూడు రోజులుగా ఎల్.ఎల్.ఆర్ సర్వర్ పనిచేయకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు. ఇవాళ కూడా కార్యాలయం ఎదుట అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. మూడు రోజులుగా సర్వర్ పని చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, సర్వర్‌ను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.