'సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి'

VZM: సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా మా తల రాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.