'మండలంలో 6,414 మంది రైతులకు అన్నదాత సుఖీభవ'
VZM: జిల్లాలో నెల్లిమర్ల మండలానికి సంబంధించి 6,414 మంది రైతులకు అన్నదాత సుఖీభవ మంజూరైనట్లు వ్యవసాయ అధికారి శ్రీలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. వారిలో పీఎం కిసాన్ పథకానికి 5, 214 మంది రైతులు అర్హులని పేర్కొన్నారు. లబ్ధిదారులకు మొత్తం రూ. 4.25 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు.