VIDEO: వర్ధన్నపేటలో గంటల తేడాలో యువకుల పార్టీ మార్పు
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో శుక్రవారం రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొంతమంది యువకులు ఉదయం ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, మధ్యాహ్నానికి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. కొన్ని గంటల తేడాలోనే రెండు పార్టీలకు మారడంతో ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.