గణేష్ నవరాత్రులతో గ్రామంలో ఆధ్యాత్మికత

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని చేగురు గ్రామంలో సాయి యూత్ వినాయక మండల్, అయ్యప్ప కాలనీ వినాయక మండల్‌లోని గణనాథులను ఆదివారం మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకదంతుడి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గణేష్ నవరాత్రులతో ప్రతి గ్రామంలో ఆధ్యాత్మికత సంతరించుకుందన్నారు.