నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
MBNR: బాలానగర్ టౌన్ పరిధిలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ కోత ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. NH 44 రోడ్ క్రాసింగ్ వద్ద టవర్ పనులు జరుగుతున్నందున 33 కేవీ నవదుర్గ, అమిత్ కాటన్ ఫీడర్లతో పాటు 11 కేవీ టౌన్ ఫీడర్లలో ఎల్సీ (LC) తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.