షిర్డీ సాయి మందిరంలో అన్న వితరణ
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో మంగళవారం ఆరో రోజు అన్న వితరణ కార్యక్రమం జరిగింది. మాలాధారణలో ఉన్న భక్తుల కోసం డోలా ఓబులమ్మ, రాజారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ప్రతిరోజు దాదాపు 600 నుంచి 800 మంది భక్తులకు భోజన ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.