5 ఆయా పోస్టులు ఖాళీ.. త్వరలో నోటిఫికేషన్
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలో 5 అంగన్వాడి కేంద్రంలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సూపర్‌వైజర్ పద్మావతి తెలిపారు. మండలంలోని పెనుబల్లి (ఎస్టీ), పంచేడు (ఎస్టీ), దామరమడుగు పల్లి పాలెం, గోపాలపురం, నాయగుంట గ్రామాల్లో ఖాళీ ఉన్నాయన్నారు. 21 నుంచి 35 వయసు లోపల ఉన్న స్థానికులకే అవకాశం ఉందన్నారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు.