ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో ఎంపీ

MBNR: జిల్లా కేంద్రంలోని పంచముఖి కాలనీలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ ఆదివారం పాల్గొన్నారు. పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్, బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలు ఇళ్లకు తిరిగి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాల పంపిణీ చేశారు.