గ్రామ బాధ్యత ‘ఆమె’దే!

గ్రామ బాధ్యత ‘ఆమె’దే!

VKB: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ధారూర్ మండల నాగారం గ్రామ సర్పంచ్ నిరటి లక్ష్మీ శ్రీనివాస్ ప్రత్యేక గుర్తింపు పొందారు. మండలంలోనే అతి చిన్న వయస్సుల సర్పంచ్ పదవిని చేపట్టిన యువ నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే యువతకు భిన్నంగా.. చిన్న వయసులోనే గ్రామాభివృద్ధి బాధ్యతను భుజానికెత్తుకున్నారు.