రోడ్డుపై పారుతున్న మురుగునీరు

రోడ్డుపై పారుతున్న మురుగునీరు

CTR: రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లి గ్రామంలో మురుగు నీటి కాలువలు లేక మురికి నీరు ఎక్కడికక్కడే నిలిచి దుర్గంధం వెదజల్లుతూ రోగాలకు నిలయంగా మారాయి. ఇళ్ల మధ్యలో మురుగు నిలిచి దోమలు ప్రబలుతున్నాయి. పలుచోట్ల చెత్త దిబ్బలు పేరుకుపోయాయి. అధికారులకు చెప్పినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.